కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా “రెట్రో” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాతో అయినా సూర్య సాలిడ్ కం బ్యాక్ ఇస్తాడు అని అనుకుంటే ఇది కూడా డిజప్పాయింట్మెంట్ నే మిగిల్చింది. అయితే తమిళ్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడిన ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చేసింది.
దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. కేవలం ఒక్క వారంలోనే ఈ సినిమా 4.2 మిలియన్ వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఓటిటిలో మాత్రం ఈ చిత్రానికి గట్టి ఆదరణే దక్కింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా 2డి సినిమాస్ వారు అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.