అగ్ర దర్శకుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈగ చిత్రం తమిళ్లో కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర ఆడియో ఈ రోజు చెన్నైలోని సత్యం సినిమాస్ మల్టిప్లెక్స్ థియేటర్లో విడుదలైంది. ఈ వేడుకకు తమిళ స్టార్ నటులు సూర్య, కార్తి హాజరై ‘నాన్ ఈ’ ఆడియో విడుదల చేసారు. అలాగే ఈవేడుకకు తమిళ దర్శకులు బాల, లింగు స్వామి, సముతిరఖని మరియు నటుడు పార్తిబన్ హాజరయ్యారు. వీరితో పాటుగా నాని, సమంతా, చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కూడా హాజరయ్యారు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర చిత్రం తమిళ్లో మావీరన్ పేరుతో విడుదలై విజయం సాధించడంతో ఈగ సినిమాపై తమిళ్లో కూడా భారీ అంచనాలున్నాయి.