‘సింగం’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో సూర్య చాలా ఆనందంగా ఉన్నాడు. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క, హన్సిక, ముఖేష్ రుషి, రెహమాన్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమా గురించి సూర్య మాట్లాడుతూ ‘ నేను చేసిన హార్డ్ వర్క్ వెనక డైరెక్టర్ హరి యొక్క విజన్ ఉంది దాంతో అందరం మా బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చాం. డైరెక్టర్ మరియు అతని టీంకి ఇది బెస్ట్ గా ఉంటుంది, ఇది అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అని తెలుసుకోవడం చాలా కష్టం ఆ విషయంలో వారు సక్సెస్ అయ్యారు. అందుకే నేను ఈ సక్సెస్ కి సంబందించిన మొత్తం క్రెడిట్ డైరెక్టర్ హరికే చెందుతుందని అన్నాను. నా గత రెండు చిత్రాలు కాస్త నిరుత్సాహపరచడం నాకు సక్సెస్ కావాల్సిన సరైన టైంలో సింగం సినిమా వచ్చింది. ఇక్కడ నన్ను ఆదరించి, నన్ను ఎంతో ఆదరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి సారి మా అమ్మ, నా భార్య జ్యోతిక నా నటనని చూసి మెచ్చుకున్నారు. ఇలా జరగడం ఇదే మొదటి సారని’ సూర్య అన్నాడు.
త్వరలోనే తెలుగులో ఓ స్ట్రైట్ ఫిలిం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాను త్వరలోనే దానికి సంబందించిన విశేషాలు తెలియజేస్తానని అన్నాడు. సూర్య త్వరలో గౌతం మీనన్ డైరెక్షన్లో ‘ధృవ నక్షత్రం’, అలాగే లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.