సునీల్ సురేష్ బాబు ల చిత్రం ప్రారంభం

సునీల్ సురేష్ బాబు ల చిత్రం ప్రారంభం

Published on Mar 17, 2012 4:11 PM IST


సునీల్ కొత్త చిత్రం ఈరోజు రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ఉదయ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతం లో ఈ చిత్రం లో తాప్సీ కథానాయికగా చేస్తుంది అని పుకార్లు వచ్చినా ప్రస్తుతం నూతన కథానాయిక కోసం వెతుకులాటలో ఉన్నారు. సునీల్ మరియు సురేష్ బాబులు కలిసి చిత్రం చెయ్యటం ఇదే తొలిసారి. ఈ చిత్ర ప్రారంభానికి రామానాయుడు,వెంకటేష్,రానా మరియు బివిఎస్ఎన్ ప్రసాద్ అతిధులుగా విచ్చేశారు. త్వరలో ఈ చిత్ర చిత్రీకరణ మొదలు కాబోతుంది.

తాజా వార్తలు