రానా పెళ్లి బడ్జెట్ బాహుబలి రేంజ్ లో..!

పాన్ ఇండియా యాక్టర్ రానా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి మిహికా బజాజ్ ని ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ 35ఏళ్ల నటుడు రెండు రోజుల్ క్రితం తన బెటర్ హాఫ్ ని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఓ ఫ్రెండ్ ద్వారా పార్టీలో వీరిద్దరికీ పరిచయం కాగా అది ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక వీరి పెళ్ళికి పెద్దల అనుమతి కూడా దక్కగా పెళ్లి చేసుకోవడమే తరువాయి. రానా తండ్రి గారైన సురేష్ బాబు లాక్ డౌన్ ముగిసిన అనంతరమే వీరి వివాహం ఉంటుందని చెప్పారు. అది కూడా డిసెంబర్ లోపే వేడుక నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

వరల్డ్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరితే గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. వీరు మొదటి ప్రిఫరెన్స్ విదేశాలలో కాగా కుదరని పక్షంలో ఇండియాలోనే ఓ రిచ్ ఏరియాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక వీరి పెళ్ళికి బడ్జెట్ కూడా భారీగా కోట్లలో కేటాయించనున్నారని వినికిడి. రామానాయుడు గారి పెద్ద మనవడు వివాహం నభూతో నభవిష్యత్ అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.

Exit mobile version