రామ్ చరణ్ జంజీర్ మూవీ రిలీజ్ పై స్టే విధించిన సుప్రీం కోర్టు

ramcharan-zanjeer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తూ బాలీవుడ్ కి పరిచయమవుతున్న సినిమా ‘జంజీర్’. తెలుగులో ఈ సినిమాను ‘తుఫాన్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పలు కారణాల వల్ల వివాదాల్లో ఇరుక్కుంటూ సినిమా విడుదల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ‘జంజీర్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలని ఆరు వారాలు వాయిదా వెయ్యాలని సుప్రీం కోర్టు స్టే విధించింది. దీనికి కారణం ఈ చిత్ర రీమేక్ రైట్స్ విషయంలో నిర్మాతలు ఒక కొలిక్కి రాకపోవడంతో కేసు ఫైల్ అయ్యింది.ఈ విషయం ఫై నిర్మాతలు ఆరు వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే రిలీజ్ కి అనుమతి ఇస్తామని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఒక సారి నిర్మాతలు, ఒకసారి రైటర్స్, ఒకసారి సంజయ్ దత్ కోర్టు వివాదం ఇలా రకరకాల వివాదాల్లో ఇరుక్కొని బయటపడ్డ ‘జంజీర్’ సినిమా ఈ తాజా వివాదం నుండి ఎన్ని రోజుల్లో బయటపడుతుందో చూడాలి. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అపూర్వ లఖియా డైరెక్టర్.

Exit mobile version