సూపర్ స్టార్ కొత్త ప్రయోగం.. ఆయనే రాసుకుంటున్నారట ?

సూపర్ స్టార్ కొత్త ప్రయోగం.. ఆయనే రాసుకుంటున్నారట ?

Published on Oct 14, 2020 1:27 AM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు నిలిచిన ఈ సినిమా పనులు ఇటీవలే మొదలయ్యాయి. త్వరలో రజినీకాంత్ సైతం షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే కరోనా ఉధృతి పూర్తిగా తగ్గే వరకు రజినీ ఇంటికే పరిమితం కానున్నారు. అంటే అయన జనవరిలో సెట్స్ లో జాయిన్ కావొచ్చని తెలుస్తోంది. ఈలోపు రజినీ ఒక పని చేయాలని అనుకుంటున్నారట.

సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు తానే స్వయంగా డైలాగ్స్ రాసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని దర్శకుడు శివకు తెలియజేసి డైలాగ్స్ రాసే పనిలో నిమగ్నమయ్యారట. ఆయన రాస్తున్న డైలాగ్స్ అన్నీ హీరో ఎలివేషన్ సన్నివేశాలేనని తమిళ సినీ వర్గాల టాక్. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో సెట్‌ను రూపొందిస్తున్నారు. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు