” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” టీజర్ కి భారీ స్పందన


చాలా ఆసక్తిగా ఎదురు చూసిన ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ” టీజర్ ఉదయం విదుదలై అప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లబిస్తోంది. ఈ చిత్రం టీజర్ కి నలుమూలల నుండి అద్భుతమైన ఆదరణ లబిస్తోంది, అలాగే ప్రేక్షకులలో ఈ చిత్రం మీద అంచనాలను అమాంతం పెంచేసింది. విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ముల కాంబినేషన్ చూడముచ్చటగా ఉంది, అంజలి , సమంతాలు చాల అందంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కాంత్ అడ్డాల దర్శకుడు, మిక్కి జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

Exit mobile version