నిజ జీవితంలో మంచి స్నేహితులైన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే తెరపై కనిపించనున్నారు.అయితే వీరిద్దరూ కనిపించేది ఒకే సినిమాలో మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ చిత్రం ఈ నెల 9న విడుదలవుతున్న విషయం తెలిసిందే. పంజా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ ట్రైలర్స్ ప్రదర్శించనున్నారు. మహేష్ బాబు గత చిత్రం దూకుడు భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పోకిరి తరువాత అదే కాంబినేషన్లో వస్తున్న బిజినెస్ మ్యాన్ పై భారీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ మరియు నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రాలపై కూడా భారీ అంచనాలున్నాయి.