ఆకట్టుకునే ధర పలికిన “గబ్బర్ సింగ్” శాటిలైట్ హక్కులు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనేర్ “గబ్బర్ సింగ్” చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది . ఈ చిత్రం విడుదలకు ముందే అద్బుతమయిన బిజినెస్ చేస్తుంది. ఈ చిత్రం మీద ఉన్న అంచనాలు ఈ మధ్యనే విడుదలయిన టీజర్ చిత్ర స్థాయి మరింత పెంచాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ హక్కులను జెమిని ఛానల్ వారు ఆరు కోట్లకు కొనుగోలు చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గణేష్ బాబు నిర్మతగా వ్యవహరిస్తున్నారు. శ్రుతి హసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version