సన్ రైజ్ మూవీస్ చిత్రం ప్రారంభం

సన్ రైజ్ మూవీస్ చిత్రం ప్రారంభం

Published on Mar 17, 2012 6:58 PM IST


గతం లో పలు విజయవంతమయిన చిత్రాలకు రచయిత గా చేసిన అంబటి గోపి దర్శకత్వంలో సన్ రైజ్ మూవీస్ పతాకం పై ఒక చిత్రం రాబోతున్నది.కొత్తూరు శతృఘ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ఈరోజే మొదలు పెట్టారు ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “అటు మాస్, ఇటు యూత్ ని ఆకట్టుకునేల ఉండబోయే ఈ ప్రేమ కథ చిత్రం లో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాం నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం. చిత్రీకరణ మే లో మొదలవుతుంది” అని చెప్పారు. ఈ చిత్రానికి చిన్ని చరణ్ సంగీతం అందిస్తుండగా కిశోర్ తాటి సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు