‘జాట్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?

‘జాట్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?

Published on May 13, 2025 9:00 AM IST

బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం “జాట్” కోసం అందరికీ తెలిసిందే. మరి మాస్ ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ అందించిన ఈ చిత్రంలో హిందీలో మంచి హిట్ అయ్యింది. ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన జాట్ కి మేకర్స్ సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే పార్ట్ 1 థియేటర్స్ లో రన్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యిపోయింది.

ఇక థియేటర్స్ లో మిస్ అయ్యిన ఈ మాస్ ట్రీట్ ని ఓటిటిలో చూసేందుకు ఆడియెన్స్ ఎదురు చూస్తుండగా ఇపుడు ఇందుకు డేట్ లాక్ అయినట్టుగా బజ్ వినిపిస్తుంది. దీనితో జాట్ చిత్రం ఈ జూన్ 5 నుంచి ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉందట. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో కేవలం హిందీ భాషలోనే ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్టుగా టాక్. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు