మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రస్తుతం నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వృషభ’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోనూ చిత్రీకరించారు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమా నుండి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘వృషభ’ మూవీ బిగ్ అనౌన్స్మెంట్ అక్టోబర్ 25న రానుందని మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఫాంటసీ యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తున్నారు.
వృషభ చిత్రాన్ని నంద కిషోర్ డైరెక్ట్ చేస్తుండగా కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సమర్జిత్ లంకేష్, సిద్ధిఖీ, శ్రీకాంత్, నయన్ సారిక, రాగిణి ద్వివేది తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
