Mr. పెళ్ళికొడుకు లవర్స్ డే రోజు రానుందా?

Mr. పెళ్ళికొడుకు లవర్స్ డే రోజు రానుందా?

Published on Jan 18, 2013 4:15 PM IST

mr-pelikodukuu

కామెడీ హీరో సునీల్ హీరోగా హిందీలో వచ్చిన ‘తను వెడ్స్ మను’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘Mr. పెళ్ళికొడుకు’ సినిమాని లవర్స్ డే కానుకగా అంటే ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోని జనవరిలోనే రిలీజ్ చేయనున్నారు. ‘పూలరంగడు’ సినిమా తర్వాత సునీల్ – ఇషా చావ్లా జోడీ కట్టిన రెండవ సినిమా ఇది.

మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి దేవీ ప్రసాద్ డైరెక్టర్. ఎస్.ఎ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ఎం.ఎస్ నారాయణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా, ట్రెడిషనల్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు