హాస్యనటుడిగా వచ్చి హీరో గా మారిన సునీల్ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు 108 కిలోల బరువు ఉన్న సునీల్ ఇప్పుడు చాలా సన్నగా కండలు తిరిగి కనిపిస్తున్నారు. గతం లో పారితోషకం ఒక చిత్రానికి పదిహేను లక్షలు తీసుకునేవాడు కాని ఇప్పుడు చిత్ర వర్గాల ప్రకారం ఈ సంక్య మూడు కోట్లుగా ఉంది. సునీల్ హీరో గ గతం లో చేసిన రెండు చిత్రాలు “మర్యాద రామన్న” మరియు “అందాల రాముడు” విజయవంతం కావడం తో సునీల్ “పూల రంగడు” విజయ పరంపర కొనసాగిద్దాం అని చూస్తున్నారు. ఈ మార్పు గురించి సునీల్ ని అడుగగా తనని తాను మంచి నటుడిగా మలుచుకోవాలనే పటుదల ఇలా చేయించింది అని చెప్పారు ఈ చిత్ర దర్శకుడు తనని ప్రధాన పాత్రలలో ఒకరిగా ఎంచుకోవటం కూడా ఒక కారణం అన్నారు. “పూల రంగడు” చిత్రం ఈరోజు(ఫిబ్రవరి 18) విడుదల కానుంది. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం.