నేడు అదృష్టాన్ని పరీక్షించుకొనున్నసునీల్

Sunil-(25)
కామెడీ హీరో సునీల్ నటించిన ‘బీమవరం బుల్లోడు’ ఈ రోజు విడుదల కానుంది. సునీల్ సోలో హీరోగా నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాదించాయి. అలాగే ఆయనికి కమెడియన్ గా కూడా మంచి పేరుంది. సునీల్ మాత్రం తన కెరీర్ ను పూర్తిగా హీరోగా చేయాలనుకుంటున్నట్టు స్టేట్ మెంట్ ఇవ్వడం జరిగింది. ‘బీమవరం బుల్లోడు’ సినిమా హిట్ ను సాదిస్తే అది సునీల్ కి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఒక వేళా అది ఆశించినంత విజయాన్ని సాదించకపొతే తరువాత ఏం చెయ్యాలనే దానిపై పునరాలోచిస్తానని తెలియజేసినట్టు సమాచారం. ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించాడు. ఎస్తార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. ఈ సినిమా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతోంది

Exit mobile version