ఫారెన్ షెడ్యూల్ ను ముగించుకున్న సునీల్ కుమార్ రెడ్డి – రామానాయుడు ల సినిమా

Sunil-Kumar-Reddy-Ramanaidu
మూవీ మొఘల్ డి. రామానాయుడు ప్రస్తుతం ‘నేనేం చిన్న పిల్లనా?’ సినిమాను నిర్మిస్తున్నాడు. పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్ మరియు సంజన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్, వైజాగ్ లలో ఎక్కువశాతం జరుపుకుంది. ఇటీవలే ఈ సినిమా డెన్మార్క్, స్వీడన్ లలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది. హీరో ప్రారంభసన్నివేశాలు, రెండు పాటలు మరికొన్ని ముఖ్యసన్నివేశాలను చిత్రీకరించారు. స్వీడన్ లో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు సినిమా ఇదేనట. అంతేకాదు ఈ అక్కడ వీరికి లభించిన ఆతిధ్యం మరువలేకపోతున్నారట. ఎం.ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ త్వరలో విడుదలకానుంది

Exit mobile version