సునీల్ మరియు ఇషా చావ్లా లు ప్రధాన పాత్రలలో మరో చిత్రం ఈరోజు రామానాయుడు స్టూడియోస్ లో మొదలయ్యింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. తను వెడ్స్ మను రిమేక్ అయిన ఈ చిత్రానికి రాధా కృష్ణుడు అనే పేరుని పరిశీలిస్తున్నారు. మాధవన్ మరియు కంగనా రనౌత్ పాత్రలను సునీల్ మరియు ఇషా లు చెయ్యబోతున్నారు. గతం లో వీరిద్దరూ ప్రధాన పాత్రలలో వచ్చిన “పూల రంగడు” అంచనాలను మించి విజయం సాదించడంతో ఈ హిందీ రిమేక్ చిత్రం కూడా భారి విజయం సాదిస్తుందని దర్శకుడు నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా సురేష్ బాబు ,సునీల్ తో ఒక చిత్రం చేయనున్నట్టు పుకారు నడుస్తుంది ఈ చిత్రానికి ఉదయ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. చూస్తుంటే సునీల్ పెద్ద హీరోల సరసన చేరిపోయినట్టే కనిపిస్తుంది కదూ.