నెగటివ్ రోల్స్ పై ఆసక్తి చూపుతున్న సునీల్

Sunil

కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన సునీల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ గా మారిపోయాడు. కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సునీల్ తన లైఫ్ స్టైల్ మరియు బాడీని ఫిట్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కండలు తిరిగిన బాడీ కలుగిన అతి తక్కువ మందిలో సునీల్ కూడా ఒకరు.

హీరోగా కొన్ని హిట్స్ అందుకున్న సునీల్ ప్రస్తుతం హీరోగా బిజీ స్టార్ అయిపోయాడు. కానీ ఈ భీమవరం బుల్లోడు ప్రస్తుతం నెగటివ్ రోల్స్ చెయ్యడానికి బాగా ఆసక్తి చూపుతున్నాడు. అందులో భాగంగానే సునీల్ ప్రస్తుతం నెగటివ్ పాత్రలకు సంబందించిన కొన్ని కథలు వింటున్నాడు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో విలన్ గా కనిపించాలనేది తన కోరికని తన మనసులోని మాటని బయటపెట్టాడు.

ఇలాంటివి సునీల్ కి సెట్ అవుతాయంటారా? సునీల్ నెగటివ్ పాత్రలు చేయగలడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.

Exit mobile version