భద్రాచలంలో సునీల్ – ఇషాచావ్లా


కామెడి హీరో సునీల్ మరియు అందాల భామ ఇషాచావ్లా జంటగా ఒక కొత్త చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్లో విజయం సాదించిన ‘తను వెడ్స్ మను’ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ భద్రాచలంలో జరుగుతోంది. సునీల్ పై శ్రీ రాముడి మీద వచ్చే కొన్ని భక్తి సన్నివేశాలను మరియు కొన్ని ఇతర సన్నివేశాలను భద్రాచలంలో చిత్రీకరిస్తున్నారు.

దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. గతంలో సునీల్ మరియు ఇషా చావ్లాలు జంటగా నటించిన ‘పూలరంగడు’ చిత్రం మంచి విజయాన్ని సాదించింది. ఇప్పడు తెరకుక్కుతున్న కొత్త చిత్రం కూడా అంతటి విజయాన్ని సాదిస్తుందని ఆశిద్దాం.

Exit mobile version