డీకే బోస్ గా రానున్న సందీప్ కిషన్?

డీకే బోస్ గా రానున్న సందీప్ కిషన్?

Published on Feb 3, 2013 12:05 AM IST

Sundeep-kishan
సందీప్ కిషన్ త్వరలో యాక్షన్ ప్యాక్డ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో కనిపించనున్నారు ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆన్ బోస్ దర్శకత్వం వహించనున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “డికేబోస్” అనే పేరుని పరిశీలిస్తున్నారు. నిషా అగర్వాల్ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ యువ పోలిస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రం గురించి అయన కాస్త ఆసక్తిగానే ఉన్నారు. రాండమ్ థాట్స్ బ్యానర్ మీద ఆనంద్ రంగా మరియు శేషు రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తర్వాతి షెడ్యూల్ లో మిగిలిన టాకీ మరియు కొన్ని పాటలను చిత్రీకరణ జరుపుకోనుంది. అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

తాజా వార్తలు