చావుని దాదాపుగా చూసొచ్చా – సందీప్ కిషన్

చావుని దాదాపుగా చూసొచ్చా – సందీప్ కిషన్

Published on Feb 5, 2012 8:56 PM IST


సందీప్ కిషన్ రాబోతున్న చిత్రం “రొటీన్ లవ్ స్టొరీ” చిత్రీకరణలో చావుకి దరిదాపులు వరకు వెళ్లి వచ్చాడు. విషయమేంటంటే ఈ చిత్రం ప్రస్తుతం రిషికేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది ఇక్కడ ఒకానొక సన్నివేశం కోసం నదిలో దిగిన సందీప్ దాపుగా మునిగిపోయాడు తరువాత కాస్త సాహసించి బయటపడ్డారు. ఈ విషయం తానే స్వయంగా ట్విట్టర్ లో చెప్పారు ” సాహసోపేతమయిన సన్నివేశాలను చిత్రీకరించారు, సన్నివేశం చేస్తూ మునిగిపోయా, దాదాపుగా చావును చూసొచ్చా, జీవితంలో కొత్త కోణాన్ని చూసాను” అన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు