మహేష్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కాదండి. సందీప్ కిషన్ త్వరలో ‘మహేష్’ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమా తమిళ్ లో విడుదలైన ‘యారుడా మహేష్’ సినిమాకు అనువాదం. ఈ చిత్రాన్ని మదన్ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జంటగా డింపిల్ చోపడే నటిస్తుంది. ఏప్రిల్ 26నే తమిళ్ లో ఈ సినిమా విడుదలైనా తెలుగులో విడుదల చెయ్యడానికి కాస్త విరామం తీసుకున్నారు. ఈ తెలుగు వెర్షన్ ను ఎస్.కె పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఆగష్టు నెలలో విడుదలకానుంది. గోపీ సుందర్ సంగీతం అందించిన అన్ని పాటలనూ తెలుగు నేపధ్య గాయనీగాయకులే పాడటం విశేషం. మహేష్ అనే పాత్ర చుట్టూ తిరిగే ఈ యూత్ ఎంటర్టైనర్లో సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి