ఈ శుక్రవారం ఎగరనున్న సుమంత్ గుర్రం

sumanth-ege
అక్కినేని వారబ్బాయి సుమంత్ హీరోగా నటించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సినిమా విజయం పై బాగా నమ్మకంగా ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సుమంత్ కి జోడీగా థాయ్ నటి పింకీ సావిక హీరోయిన్ గా నటించింది. గతంలో సున్నితమైన కథాంశాలతో సినిమాలు తీసిన చంద్ర సిద్దార్థ్ ఈ సినిమాకి డైరెక్టర్. ‘అమృతం’ సీరియల్ తో అందరికి పరిచయం ఉన్న ఎస్ఎస్ కాంచి ఈ సినిమాకి కథని అందించాడు. పూదోట సుదీర్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

Exit mobile version