ఆ పాత్ర చేయడానికి స్ఫూర్తి ఏఎన్ఆర్ – సుమంత్

Sumanth-and-ANR
అక్కినేని వారి హీరో సుమంత్ హీరోగా నటించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాకి సంబందించిన కొన్ని ఫోటోలు ఇటీవలే రిలీజ్ చేసారు. ఈ ఫోటోలలో సుమంత్ లేడీ గెటప్ లో కనిపించి అందరినీ కాస్త షాక్ కి గురిచేశాడు. సుమంత్ ఆన్ స్క్రీన్ ఇది వరకు ఎప్పుడూ ఇలా కనిపించలేదు. మొదట్లో ఆ సీన్స్ చెయ్యడానికి సుమంత్ కాస్త సముఖతని చూపలేదు.

తాజాగా సుమంత్ ఆ పాత్ర చేయడానికి తన తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు గారే తనకి స్ఫూర్తి అని చెప్పాడు. ఈ చిత్ర డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్ సుమంత్ ఈ సీన్స్ చెయ్యను అన్నప్పుడు ఏఎన్ఆర్ గారు సోలో హీరోగా పరిచయం కాకముందు చాలా సినిమాల్లో ఆడ వేషాలు వేసారని చెప్పగా ఆలోచించిన సుమంత్ తనలోని అనుమానాలను పక్కన పెట్టి ఓ పాటలో లేడీ గెటప్ వేయడానికి ఒప్పుకున్నాడు.

పింకీ సావిక హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి ఎస్ఎస్ కాంచీ కథని అందించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version