‘మహేంద్రగిరి వారాహి’ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ కంటెంట్ చిత్రాల్లో నటిస్తూ హీరో సుమంత్ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా’ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా రానున్న ఈ సినిమాకు సుమంత్ తాజాగా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మేకర్స్ షేర్ చేశారు. ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కావడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

ఇక ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version