సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సుకుమారుడు’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సుకుమారుడు’

Published on May 4, 2013 5:20 PM IST

SUKUMARUDU

హీరో ఆది, నిషా అగర్వాల్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘సుకుమారుడు’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ను జారి చేశారు.శ్రీ సౌదామిని క్రియేషన్స్ పథకం పై కెవివి సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి’ పిల్ల జమిందార్’ డైరెక్టర్ అశోక్ జి దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారద, చంద్రమోహన్ లు ప్రధాన పాత్రలలో నటించగా ఎం.ఎస్ నారాయణ, తనికెళ్ళ భరణిరావు, రావు రమేష్, చలపతిరావు, తాగుబోతు రమేష్ లు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా మే 10న విడుదలకానుంది.

తాజా వార్తలు