సుకుమార్ ప్రొడక్షన్ లో మొదలైన మొదటి మూవీ

sukumar
కొద్ది నెలల క్రితం సుకుమార్ సుకుమార్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై సినిమాలు నిర్మించనున్నాడని తెలియజేశాడు. సుకుమార్ ప్రొడక్షన్ హౌస్ మొదటి సినిమాతో ఆయన అసోసియేట్ డైరెక్టర్ అయిన వేమారెడ్డి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అంతక ముందు ఆ తరువాత సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

మరోవైపు సుకుమార్ ‘1-నేనొక్కడినే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

Exit mobile version