First Posted at 17:40 on Apr 21st
సూపర్ స్టార్ మహేష్ తో సినిమా మొదలుపెట్టగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. మాకు అందిన రిపోర్ట్ల ప్రకారం ఈ సినిమాకుగానూ ఎడతెరపీ షూటింగ్లో పాల్గునడంతో మహేష్ కు వెన్నులో సమస్య వచ్చిందంట. అయినా సరే వెనకడుగు వెయ్యకుండా ఆ బాధను ఓర్చుకుని మరీ యాక్షన్ సీక్వెన్స్ లో అద్బుతంగా నటిస్తున్నాడు.
ఈ టాలీవుడ్ అందగాడు కొత్త లుక్ కోసం, సరైన దేహదారుడ్యం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇదిలావుండగా సుకుమార్ సైతం ఈ సినిమాను ఒక సవాలుగా తీసుకుని మహేష్ ను మునుపెన్నడూ చూడని ఒక కొత్త కోణంలో మనకు చూపించనున్నాడు. సో మహేష్ కు ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా అవన్నీ అధిగమించి మనకు తనలో ఉన్న కొత్త మహేష్ ను చూపించాలని ఆరాటపడుతున్నాడు.