బన్నీ కోసం బాలీవుడ్ ఐటెం బాంబ్ రానుందా?

బన్నీ కోసం బాలీవుడ్ ఐటెం బాంబ్ రానుందా?

Published on Apr 29, 2020 11:09 AM IST

సుకుమార్ సినిమా అంటే ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఆయన మొదటి చిత్రం ఆర్య నుండి రంగస్థలం వరకు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ అనేది పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ తో ఆయన చేసిన నాన్నకు ప్రేమతో సినిమాలో మాత్రమే సుకుమార్ ఐటెం సాంగ్ పెట్టలేదు. సబ్జెక్టు రీత్యా ఆ సినిమాకు ఐటెం అంత సూట్ కాదని ఆయన వదిలేశాడు. మరి సుకుమార్ లేటెస్ట్ మూవీ పుష్ప మాస్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో మాస్ మసాలా ఐటెం సాంగ్ కంపల్సరీ అని సుకుమార్ ఫిక్స్ అయిపోయాడట.

దీనితో ఆ సాంగ్ లో బన్నీతో చిందేసే ఐటెం పాప కోసం ఆలోచన మొదలుపెట్టారట. మంచి డాన్స్ స్కిల్స్ తోపాటు గ్లామర్ కలిగిన హాట్ బ్యూటీ కోసం ఆయన అనేక పేర్లు పరిశీలిస్తున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న మూవీ కావడంతో మరింత కేర్ తీసుకుంటున్న సుకుమార్ బాలీవుడ్ నుండే ఐటెం బాంబ్ ని దింపే అవకాశం కలదని తెలుస్తుంది. మలైకా అరోరా, దిశా పటాని, జాక్విలిన్ వంటి టాప్ ఐటెం భామలు సుకుమార్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుండగా దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు