సమయం వృథా చేయనంటున్న క్రియేటివ్ డైరెక్టర్ !

సమయం వృథా చేయనంటున్న క్రియేటివ్ డైరెక్టర్ !

Published on Mar 18, 2020 1:00 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కరోనా వైరస్ కారణంగా నిలిపివేయబడిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సుకుమార్ అండ్ అతని టీం ఈ సమయం వృథా చేయకూడదనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ కోసం లొకేషన్స్ ను వెతుకుతున్నారు. తూర్పు గోదావరిలోని పలు ప్రదేశాలలో ఇప్పటికే కొన్ని లొకేషన్స్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గాక అక్కడే తదుపరి షెడ్యూల్ షూటింగ్ ను ప్లాన్ చేయనున్నారు. మొదటి షెడ్యూల్ లో ఓ సాంగ్ షూట్ చేయనున్నారట. ఇక ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటం కారణంగా సినిమాలో చాల క్యారెక్టర్స్ ఉంటాయని.. ఆ క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్.. ఈ సినిమాతో కొంతమంది నూతన నటీనటులను పరిచయ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు. ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

తాజా వార్తలు