టాలీవుడ్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ ప్రస్తుతం తన మోస్ట్ ఫేవరెట్ లవబుల్ కాంబో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తమ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ “పుష్ప” ను స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ద్వారా బన్నీ మొదటిసారి పాన్ ఇండియన్ వరల్డ్ లోకి అడుగు పెట్టనున్నాడు. మొత్తం 5 భాషల్లో ప్లాన్ చేసిన ఈ భారీ ప్రాజెక్టును సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. అయితే ఈ పాటికే ఎంతో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ చిత్రం పరిస్థితుల ప్రభావం మూలాన బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు మెల్లమెల్లగా మన టాలీవుడ్ సినిమాలు షూటింగ్స్ కూడా మొదలవుతున్నాయి. పలు భారీ ప్రాజెక్టులు కూడా ఏ నెల నుంచి షూట్ స్టార్ట్ చెయ్యాలో ప్రణాళికలు వేసుకుంటున్నారు. కానీ పుష్ప విషయంలో మాత్రం ఇంకా ఏ విషయం అన్నది తెలియరాలేదు. దీనితో సుకుమార్ ఇంకా మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారా లేక మరేమన్నా ఆలోచనలో ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.
ఈ చిత్ర కథా నేపథ్యం ప్రకారం అవుట్ డోర్ లోనే చెయ్యాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ సమయం తీసుకుంటున్నారేమో అని చెప్పాలి. మరి సుకుమార్ ఏమనుకుంటున్నారో తెలియాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో బన్నీ సరసన రష్మికా మందన్నా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.