బన్నీ విలన్ గా బాలీవుడ్ హీరో?

సుకుమార్-అల్లు అర్జున్ ల క్రేజీ మూవీ పుష్ప పై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పై హైప్ ఫస్ట్ లుక్ తరువాత మరింత పెరిగింది. రాయలసీమకు చెందిన మొరటు కుర్రాడిగా బన్నీ డీగ్లామర్ లుక్ కేక పుట్టిస్తుంది. ఇక ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో క్యాస్టింగ్ కూడా భారీగా పలు పరిశ్రమలకు చెందినవారిని తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఇక ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నుండి తీసుకుకొనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ముఖ్యంగా ఆయన సీనియర్ హీరోలు అయిన సంజయ్ దత్, సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లలలో ఎవరినో ఒకరిని ఒప్పించి తీసుకోవాలని అనుకుంటున్నారట. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తుండగా ఆయన పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

Exit mobile version