ఈ బ్లాక్‌బస్టర్ కాంబో రిపీట్ అయ్యేనా..?

Sukumar-Dil-Raju

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్య’ను అందించిన సుకుమార్ – దిల్ రాజు కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి క్రియేట్ అయింది. అయితే, 2004లో వచ్చిన ‘జగడం’ సమయంలో వరి మధ్య సృజనాత్మక భేదాలు కలిగినా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో వీరు కలిసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సిరీస్‌లోని నెక్స్ట్ చిత్రం లేక.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే సినిమాలో ఏదో ఒక సినిమాకు దిల్ రాజు సిద్ధం కానున్నాడట. దీంతో సుకుమార్‌తో దిల్ రాజు కాంబినేషన్ మరోసారి ఫిక్స్ అనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

వీరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ లేకపోయినా, వీరి కాంబో ఫిక్స్ అయ్యిందనే వార్తతో అభిమానుల్లో సంతోషం నెలకొంది.

Exit mobile version