బన్నీని సుకుమార్ మరో చిట్టిబాబుగా మార్చేస్తాడా?

బన్నీని సుకుమార్ మరో చిట్టిబాబుగా మార్చేస్తాడా?

Published on Mar 19, 2020 6:57 AM IST

అల వైకుంఠపురంలో మూవీతో బడా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి కావలసిన లుక్ కోసం మేక్ ఓవర్ అయ్యేపనిలో ఉన్నాడు. అందుకే ఆయన జులపాలు మరియు గడ్డం పెంచేస్తున్నాడు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీ చిత్తూరు కి చెందిన మాస్ లారి డ్రైవర్ రోల్ చేయనున్నాడు. బన్నీ ఇప్పటికే రాయలసీమ మాండలికం పై పట్టు సాధిస్తుండగా, ఆయన లుక్ చాల వరకు రంగస్థలంకి చరణ్ పోషించిన చిట్టి బాబు పాత్రను పోలి వుంటుందని సమాచారం అందుతుంది.

రంగస్థలం సినిమాలో సుకుమార్ చరణ్ ని గోదావరి జిల్లాలకు చెందిన పల్లె యువకుడిగా చూపించారు. ఇక ఈ చిత్రంలో బన్నీని రాయలసీమకు చెందిన మాస్ యువ లారీ డ్రైవర్ గా ప్రజెంట్ చేయనున్నారు. మాండలికం తప్పించి బన్నీ రోల్ కూడా చిట్టిబాబు రోల్ కి దగ్గరగా ఉంటుందని వినికిడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందాన నటిస్తుంది.

తాజా వార్తలు