OG : వన్స్‌మోర్ సర్‌ప్రైజ్ రివీల్ చేసిన సుజీత్..!

OG movie Review

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఓజీ మేనియాతో ఊగిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర చేయబోయే విస్ఫోటం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో దర్శకుడు సుజీత్ పవన్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వన్స్‌మోర్ అనే ఆన్‌లైన్ వీడియో గేమ్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు మేకర్స్.

ఈ వీడియోలో కొన్ని స్టేజీల తర్వాత ఫైర్‌స్టోర్మ్ అన్‌లాక్ చేయబడుతుందని మేకర్స్ వెల్లడించారు. అయితే, తాజాగా ఈ వీడియో గేమ్‌ను లక్ష మంది అభిమానులు వీక్షిండంతో ఈ సర్‌ప్రైజ్‌ను అన్‌లాక్ చేశారు. ఇక ఓజీ అనే కామిక్ బుక్‌ను త్వరలోనే తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ కామిక్ బుక్‌తో అభిమానుల ఆకలి మరింత తీరడం ఖాయమని సుజీత్ తెలిపాడు. తన తోటి అభిమానులకు కామిక్ బుక్‌ను అంకితమిస్తున్నట్లు సుజీత్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version