ఫోటో మూమెంట్ : ఓజీతో బాక్సాఫీస్‌ను తగలబెట్టేందుకు సిద్ధం..!

Sujeeth-&-Thaman

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి లాస్ట్ మినట్ వర్క్‌ను సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కలిసి ముగించారు. దీంతో వారు ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను తగలబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వారు ఫైనల్ ఔట్‌పుట్ చూశాక ఇద్దరు కలిసి చేతులు కలిపి సంతోషం వ్యక్తం చేస్తున్న ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version