చరణ్‌తో సినిమా.. అందుకే ఆగిందన్న సుజీత్

‘ఓజీ’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి నిమిషం వరకు బిజీగా ఉన్నందున, దర్శకుడు సుజీత్ ప్రమోషన్లలో పాల్గొనలేకపోయారు. ఇప్పుడు మాత్రం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సాహో తర్వాత రామ్ చరణ్ గారితో సినిమా చేయాలని ప్లాన్ చేశాను. యూకే నేపథ్యంలో కథ సిద్ధం చేశాం. అయితే కోవిడ్ సమయంలో విదేశాల్లో షూటింగ్ సాధ్యం కాదన్న వాదనల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది” అని తెలిపారు.

ఓజీ తర్వాత సుజీత్, నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ది ప్యారడైస్’ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.

Exit mobile version