నానమ్మని స్పూర్తిగా తీసుకొని ఆ పాత్ర చేసాను – సుహాసిని

Suhasini

తెలుగులో టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్స్ లో సుహాసిని ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఒకప్పుడు తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించిన ఆమె ఇప్పటికీ కొన్ని కొన్ని కీలక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామానుజన్’ సినిమాలో రామానుజన్ కి తల్లి పాత్ర చేస్తోంది.

ఈ పాత్ర గురించి ఆమె చెబుతూ ‘ రామానుజం జీవితంలో ఆమె తల్లి పాత్ర కోమలత్తమ్మాల్ పాత్ర ఎంతో ఉంది. అలాంటి పాత్ర నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మాములుగా రామానుజం తల్లి చాలా డామినేటింగ్. ఆ పాత్ర కోసం నేను మా అమ్మమ్మని స్పూర్తిగా తీసుకున్నాను. అలాగే కుటుంబంలోని వారి దగ్గర, స్నేహితుల దగ్గర ఉన్న 9 గజాల చీరలు సేకరించాను. నగల విషయంలో, కేశాలంకరణ విషయంలో మా అమ్మ ఫోటోలను చూసి డిజైన్ చేసుకున్నాను. నాకు మాములుగా మడికట్టు కోవడం తెలియదు. కానీ కష్టపడి ఈ సినిమా కోసం నేర్చుకున్నాను. ఈ సినిమాలో నటించడం కొత్త అనుభూతిని ఇస్తోందని’ ఆమె తెలిపింది.

Exit mobile version