‘మండాడి’లో సుహాస్ మాస్ ఎంట్రీ.. అదిరింది!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. హీరోగా సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామ’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుహాస్ బిజీగా ఉన్నాడు. అయితే, ఆయన తమిళ ఇండస్ట్రీలో తొలిసారి ఓ సినిమాలో నటించబోతున్నాడు. వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడక్షన్‌లో రూపొందనున్న ‘మండాడి’ అనే సినిమాలో సుహాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తమిళ నటుడు సూరి తో పాటు సుహాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని సుహాస్ లుక్‌ని రివీల్ చేస్తూ ఈ పోస్టర్ తీర్చిదిద్దారు. పక్కా మాస్ అవతారంలో సుహాస్ లుక్ అదిరిపోయింది. అయితే, ఈ సినిమా నేపథ్యంతో పూర్తిగా సముద్రంపై సాగనుంది. దీంతో ఈ సినిమాలో సుహాస్ ఓ జాలరిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సుహాస్ మాస్ లుక్‌తో వేసుకున్న జెర్సీపై సునామీ రైడర్స్ అనే క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమాలో సుహాస్ పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్నారు. మ‌హిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స‌త్యరాజ్‌, అచ్యుత్‌ కుమార్, స‌చ్చనా న‌మిదాస్‌, ర‌వీంద్ర విజ‌య్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version