సుధీర్ బాబు ప్రేమ కథా చిత్రమ్ వాయిదా పడిందా?

Prema-katha-chitram

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన సుధీర్ బాబు త్వరలోనే ‘ప్రేమ కథా చిత్రమ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ వారాంతంలో రిలీజ్ కావాలి కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ విడుదలైంది. కొంతమంది ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చెయ్యమని సలహా ఇచ్చినట్టు సమాచారం. కానీ ఈ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జె. ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ‘ఈ రోజుల్లో’ ఫేం మారుతి ఈ సినిమాకి కథ అందించాడు అలాగే దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసాడు. జెబి సంగీతం అందించిన ఈ సినిమాని సుదర్శన్ రెడ్డి – మారుతి సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version