సిక్స్ ప్యాక్ బాడితో కనిపించనున్న సుధీర్ బాబు

సిక్స్ ప్యాక్ బాడితో కనిపించనున్న సుధీర్ బాబు

Published on Mar 24, 2012 3:52 PM IST


ఇటీవలే ఎస్.ఎం.ఎస్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయిన సుధీర్ బాబు తన రాబోయే యాక్షన్ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ శరీరాన్ని పెంచనున్నారు. గతంలో “రక్ష” చిత్రానికి దర్శకత్వం వహించిన వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో పాత్ర కోసం చేస్తున్న సన్నాహాల గురించి చెప్తూ ” కొత్త చిత్రం కోసం కసరత్తు మొదలు పెట్టాను ఫైట్స్ మరియు డాన్స్ ల గురించి చాలా నేర్చుకుంటున్నా, గాయపడకుండా నేర్చుకోటానికి ప్రయత్నించాలి. ఇప్పుడు సిక్స్ ప్యాక్ శరీరం కోసం కసరత్తు మొదలు పెట్టాను, రోజు జిమ్ కి వెళ్తున్నాను. గతంలోనే స్వంతంగా నేర్చుకున్నా ఇప్పుడు శిక్షకుడి వద్ద నేర్చుకుంటున్నాను” అని అన్నారు. తెరకు పరిచయం కాకముందు సిద్దం చేసుకున్న ఫోటోలలో తన శరీర సౌష్టవం చూడవచ్చు. ఇప్పుడు నిపుణుల చేతిలో ఈయన ఇంకా రాటుదేలబోతున్నారు. ఈ మధ్య సునీల్ తన సిక్స్ ప్యాక్ బాడితో అందరిని ఆశ్చర్యపరిచారు సుధీర్ బాబు లాంటి వారికి స్ఫూర్తిగా నిలిచారు.

తాజా వార్తలు