సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న సుదీర్ బాబు

Sudheer-Babu1

యంగ్ హీరో సుదీర్ బాబుకి బాగా ఫీట్ గా ఉండే బాడీ ఉంది. కానీ తను చేసిన సినిమాల్లో తన బాడీని చూపించే అవకాశం రాలేదు. ఆ అవకాశం ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాలో వచ్చింది. ఈ సినిమాలో సుదీర్ బాబు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఆడియోని, మూవీని ఇదే నెలలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవుతాయని భావిస్తున్నారు.

అస్మితా సూద్, పూనం కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కృష్ణ రెడ్డి దర్శకుడిగా పరిచామవుతున్నాడు. సుబ్బారెడ్డి – ఎస్ఎన్ రెడ్డి సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Exit mobile version