ఘట్టమనేని ఫ్యామిలీ హీరోల్లో మహేశ్ తరువాత క్రేజ్ తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. సుధీర్ బాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. కాగా తాజాగా సీనియర్ ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ చెప్పి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.
వీడియోలో ఎన్టీఆర్ విజువల్స్ కు అనుగుణంగా సుధీర్ బాబు డైలాగ్ చెప్తూ.. ‘ఏమంటివి ఏమంటివీ , జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువ?హ.., ఎంతమాట ఎంతమాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్షా కాదే , కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువ, నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా హహహ నిది ఎ కులమూ? ఇంత ఎలా? అస్మత్పితామహుడు కురుకుల వృద్దుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా హహహ ? ఈయనదే కులమో? హ్మ్ హ్మ్ హహాహ’ అంటూ అచ్చం ఎన్టీఆర్ స్టైల్ లో సుధీర్ బాబు డైలాగ్ చెప్పుకొచ్చాడు.