ఐటమ్ నెంబర్ గా డాన్స్ చేయనున్న సుదీర్ బాబు

Sudheer-Babu
సుదీర్ బాబు నటించిన గత చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్’ మంచి విజయాన్ని సాదించడంతో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. సుదీర్ నటించిన ఫస్ట్ సినిమా ‘ఎస్ఎంఎస్’. ఈ సినిమాలో అతని నటనకి ఫస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ గా సీమ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. అదే రోజున ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమా 100 డేస్ వేడుకను జరుపుకుంది. దీనితో అతడు చాలా ఆనందంగా వున్నాడు. తను ప్రస్తుతం నటిస్తున్న మూవీ ‘ఆడు మగడ్రా బుజ్జి’. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఈ మద్య సుదీర్ పుట్టిన రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సుదీర్ ఈ సినిమాలో ఒక ఐటమ్ నెంబర్ గా మొదటి సారిగా చేయనున్నాడు. ఈ పాటకి బాబా మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. దీనిలో సుదీర్ చక్కని డాన్సు చేయనున్నాడని సమాచారం. పూనం కౌర్, అస్మిత సూద్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Exit mobile version