టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తొలిసారి ప్రొడ్యూస్ చేసిన చిత్రం ‘శుభం’. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేయగా హార్రర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
అయితే, ఈ సినిమాకు టాక్ బాగున్నా, తొలిరోజు కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉన్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.5.25 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా టోటల్ రన్లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.