ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం తో ఒకో ఎపిసోడ్?

ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం తో ఒకో ఎపిసోడ్?

Published on Oct 10, 2025 8:08 AM IST

stranger things final season

ఈ కొన్నేళ్ళలలోనే ఓటిటి హవా ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ప్రపంచ కంటెంట్ అంతా ప్రతీ ఒక్కరికీ చేరువలో ఉంది. మరి అలా వరల్డ్ వైడ్ మంచి పాపులార్టీ ఉన్న సాలిడ్ వెబ్ సిరీస్ లలో హాలీవుడ్ సిరీస్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ కూడా ఒకటి. నాలుగు బ్లాక్ బస్టర్ సీజన్స్ తర్వాత సీజన్ 5 పై మంచి హైప్ ఉంది. దీనితో ఈ సీజన్ కోసం ఎగ్జైటెడ్ గా చూస్తున్న ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ రన్ టైం ప్రతీ ఎపిసోడ్ కి లాక్ అయినట్టుగా వినిపిస్తుంది.

ఇది వరకే ఈ సీజన్ ని రెండు పార్టీలుగా విడదీసి పూర్తి చేసేస్తారని కొంచెం డిజప్పాయింట్ అయ్యారు కానీ ఇపుడు ఒకో ఎపిసోడ్ తాలూకా రన్ టైం వింటే మాత్రం మతిపోవాల్సిందే అని చెప్పాలి. ఎందుకంటే ఒకో ఎపిసోడ్ ఏకంగా 2 గంటల మేర ఉంటుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఒక వెబ్ సిరీస్ లో ఒకో ఎపిసోడ్ ఇంత రన్ ఉండడం అనేది చాలా అరుదు అని చెప్పాలి.

ఇది వరకు గంట పైగానే ఉంటాయని తెలిసింది కానీ ఇప్పుడు రెండు గంటలు అంటున్నారు. మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో చూడాలి. అలాగే ఒకో ఎపిసోడ్ కి గాను మేకర్స్ ఏకంగా 50 నుంచి 60 మిలియన్ డాలర్స్ కి పైగా ఖర్చు చేశారనే టాక్ కూడా ఉంది. ఇక ఈ సీజన్ తాలూకా మొదటి వాల్యూమ్ ఈ నవంబర్ 27న నెట్ ఫ్లిక్స్ లో రానుంది సో చూడాలి నిజంగానే ఈ షాకింగ్ రన్ టైం లోనే వస్తాయా లేక తక్కువ లోనే ఉంటాయా అనేది.

తాజా వార్తలు