స్క్రీన్ ప్లే కన్నా కథే ముఖ్యం – సునీల్ కుమార్ రెడ్డి

p-sunil-kumar-reddy-01
‘సొంతఊరు’, ‘గంగపుత్రులు’ సినిమాలతో విమర్శకుల మెప్పు పొంది, ‘ఒక రొమాటిక్ క్రైమ్ కథ’తో యూత్ ని ఆకట్టుకొని కమర్షియల్ గా హిట్ అందుకొన్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి. అలాంటి డైరెక్టర్ తాజాగా డా. డి. రామానాయుడు నిర్మాణ సంస్థలో ‘నేనేం చిన్నపిళ్ళనా’ సినిమాకి దర్శకత్వం వహించాడు. ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్, తన్వీ వ్యాస్ జంటగా నటించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆయన్ని సినిమాకి కథ ముఖ్యమా లేక స్క్రీన్ ప్లే ముఖ్యమా అని అడిగితే ‘ చిత్రంలో వచ్చే మలుపుల కన్నా కథే ముఖ్యం. మన ప్రేక్షకులకి స్క్రీన్ ప్లే ముఖ్యం కాదు వినోదాన్ని అందించామా లేదా అన్నదే ముఖ్యం. ఉదాహరణకి. రామాయణం అందరికీ తెలుసు అయినా సినిమా తీస్తే ఎందుకు థియేటర్స్ కి వస్తారు అంటే ఆ కథని చూడటం వాళ్లకి ఇష్టం. అలాగని స్క్రీన్ ప్లే మార్చి రామాయణాన్ని చెప్పలేం కదా .. నేను ఇప్పటి వరకు 10 సినిమాలు చేసాను. కథతో పాటే నా ప్రయాణం కొనసాగుతోందని’ సునీల్ కుమార్ రెడ్డి అన్నాడు.

Exit mobile version