ఎఫ్ 3లో స్టార్ హీరో క్యామియో?

లాక్ డౌన్ కారణం తన రైటింగ్ టీమ్ తో పాటు సొంత ఊరిలో ఉండిపోయారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అక్కడే తన టీమ్ తో కలిసి ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మళ్ళీ వంకీ, వరుణ్ లతో పాటు తమన్నా, మెహ్రీన్ నటించనున్నట్లు ఇప్పటికే అనిల్ రావిపూడి స్పష్టత ఇచ్చారు. ఐతే ఈ చిత్రంలో మరో హీరో ఉంటాడని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుండగా అనిల్ దానిపై హింట్ ఇచ్చారు. మరో హీరో ఉండడం ఖాయం అన్న అనిల్ అది ఎవరనేది సర్ప్రైజ్ అన్నారు.

కాగా ఆ మూడో పాత్ర జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే అని ఆయన మాటలను పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి ఎఫ్ 3లో స్టార్ హీరో క్యామియో రోల్ చేసే అవకాశం కనిపిస్తుంది. 2019 సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 రెండు బడా చిత్రాలను వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నాన్ స్టాప్ కామెడీ, హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక సూపర్ హిట్ టాక్ నేపథ్యంలో భారీ కలెక్షన్స్ ఈ మూవీ అందుకుంది.

Exit mobile version