యాక్షన్ 3డి ప్రీమియర్ కు హాజరుకానున్న ప్రముఖులు

యాక్షన్ 3డి ప్రీమియర్ కు హాజరుకానున్న ప్రముఖులు

Published on Jun 19, 2013 6:30 PM IST

Action-3D-Latest-Poster-HD-

కామెడీ కింగ్ అల్లరి నరేష్ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ‘యాక్షన్ 3డి’ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ఈ రోజు రాత్రి సినీమాక్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో కు పలు సినీ ప్రముఖులు, మీడియా అతిధులు హాజరుకానున్నారు. గురువారం ఈ చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు.

అనీల్ సుంకర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా కృత నిశ్చయంతో ఈ సినిమా తీసిన ఆయన అల్లరి నరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇచ్చారు. ఈ ‘యాక్షన్ 3డి’ సినిమా ఇండియాలోనే మొదటి కామెడి 3డి సినిమాగా రానుంది

కిక్ శ్యామ్, వైభవ్ మరియు రాజు సుందరం ప్రధాన పాత్రధారులు. సునీల్, పోసాని మరియు సుదీప్ ముఖ్య పాత్రలలో నటించారు. స్నేహ ఉల్లాల్, కామ్నా జట్మలాని, నీలం ఉపాధ్యాయ్ హీరోయిన్స్ . బప్పి లహరి- బప్పా లహరి సంగీత దర్శకులు.

తాజా వార్తలు